ఆయిల్‌ ఇండియాలో మేనేజర్‌ పోస్టులు

by సూర్య | Wed, Jan 06, 2021, 12:22 PM

ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అసోంలో పనిచేయాల్సి ఉంటుంది. 


మొత్తం పోస్టులు: 65


 


ఇందులో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (డ్రిల్లింగ్‌)-3, మేనేజర్‌ (అకౌంట్స్‌)-1, మెడికల్‌ ఆఫీసర్‌-7, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌-7, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌-2, సీనియర్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌, హెచ్‌ఆర్‌, లీగల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, జియోఫిజిక్స్‌, రిజర్వాయర్‌)-43, సైకోథెరపిస్ట్‌-1, కాన్ఫిడెన్షియల్‌ సెక్రెటరీ-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. 


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ లేదా ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ద్వారా


 


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM