వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
 

by Suryaa Desk |

వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. విభజించి పాలించు అన్న.. బ్రిటిష్ కుటిల నీతిని సీఎం జగన్  పాటిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లు నేతిబీరకాయలాంటివి అని వ్యాఖ్యానించారు. నేతిబీరకాయలో నెయ్యి ఉండదని, బీసీ కార్పొరేషన్లో నిధులు ఉండవని తప్పుబట్టారు. బీసీలకు నిజమైన నేస్తం కాంగ్రెస్ ఒక్కటేనని తెలిపారు. 50 సంవత్సరాల క్రితమే బీసీలకు 25% రిజర్వేషన్లు కాంగ్రెస్ కల్పించిందని గుర్తుచేశారు. 26 సంవత్సరాల క్రితమే బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్‌లు కాంగ్రెస్ కల్పించిందని తెలిపారు. 12 సంవత్సరాల క్రితమే ఫీజు రియంబర్స్‌మెంట్ స్కాలర్ షిప్పులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని తులసిరెడ్డి అన్నారు.

Latest News
అనంతపురం జిల్లాలో దారుణం.. పెళ్ళైన నెలకే గర్భం దాల్చిందని.. Thu, Nov 26, 2020, 05:31 PM
తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న ముప్పు..బీ అలర్ట్ Thu, Nov 26, 2020, 05:15 PM
ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు రద్దు కాలేదు Thu, Nov 26, 2020, 04:42 PM
హీట్ పుట్టిస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సమరం Thu, Nov 26, 2020, 04:08 PM
జగన్ కి డబుల్ బొనాంజా.. ఫుల్ జోష్ లో వైసీపీ Thu, Nov 26, 2020, 03:21 PM