అప్పుడే ఊడిపడుతున్న కనకదుర్గ ఫ్లైఓవర్ కాంక్రీట్ పెచ్చులు
 

by Suryaa Desk |

బెజవాడలో ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ డ్యామేజ్ అయింది. అశోక పిల్లర్ సమీపంలో ఫ్లైఓవర్ నుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌(పీసీ 2928)కు చెందిన రాంబాబు దసరా ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు కోసం ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఫ్లైఓవర్ పెచ్చులు ఊడిపడడంతో చేతికి, భుజానికి గాయాలు అయ్యాయి. ఫ్లైఓవర్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లైఓవర్ పటిష్టతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest News
అనంతపురం జిల్లాలో దారుణం.. పెళ్ళైన నెలకే గర్భం దాల్చిందని.. Thu, Nov 26, 2020, 05:31 PM
తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న ముప్పు..బీ అలర్ట్ Thu, Nov 26, 2020, 05:15 PM
ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు రద్దు కాలేదు Thu, Nov 26, 2020, 04:42 PM
హీట్ పుట్టిస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సమరం Thu, Nov 26, 2020, 04:08 PM
జగన్ కి డబుల్ బొనాంజా.. ఫుల్ జోష్ లో వైసీపీ Thu, Nov 26, 2020, 03:21 PM