రాష్ట్రంలో దిశా చట్టం అమలు కావడం లేదు : టీడీపీ నేత వంగలపూడి అనిత

by సూర్య | Sun, Oct 18, 2020, 03:21 PM

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ నేత వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై 300లకు పైగా దాడులు జరిగాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా యర్రంపాడులో బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారం చేశాడని, ఇప్పటి కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో దిశా చట్టం అమలు కావడం లేదని తప్పుబట్టారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ..మహిళల భద్రతపై ఎందుకు చూపడం లేదు? అని ప్రశ్నించారు. వాలంటీర్ల ఆగడాలకు అంతులేకుండా పోయిందని వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు.


దిశ బిల్లును వెనక్కి కేంద్రం పంపిన విషయం తెలిసిందే. బిల్లులో లోపాలు, అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెప్పింది. అభ్యంతరాలు, లోపాలను సవరించి ముసాయిదా బిల్లును రూపొందించాలని కేంద్రం సూచించింది. గత ఏడాది డిసెంబర్‌లో బిల్లును ఆమోదించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. బిల్లు వెనక్కి రావడంతో మళ్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన తర్వాతే.. కేంద్రానికి పంపాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM