ప్రతికూల వాతావరణం కారణంగా కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్

by సూర్య | Sun, Oct 18, 2020, 02:29 PM

తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీవారి దర్శనం కోసం శ్రీనివాసన్‌ తన కుటుంబంతో కలిసి కోయంబత్తూరు నుంచి తిరుమలకు హెలీకాప్టర్ ద్వారా బయలు దేరారు. అయితే కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు జిల్లాలో పొగమంచు కమ్మేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్ ఇక ముందుకు కదలలేని పరిస్థితిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరుపత్తూరులోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలీకాప్టర్ క్షేమంగా ల్యాండ్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాతావరణం అనుకూలించడంతో హెలీకాప్టర్ తిరుపతికి బయలుదేరింది. హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లతో సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పొలాల్లో దిగిన హెలీకాప్టర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM