ఏపీలో కూడా డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లు..

by సూర్య | Fri, Oct 16, 2020, 03:34 PM

ఏపీలో కూడా డిగ్రీ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచే ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.
ఈ మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, అటానమస్‌ డిగ్రీ కాలేజీల్లో 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీలో 85% సీట్లు స్థానికులకు.. 15% సీట్లు స్థానికేతరులకు కేటాయించనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా రిజర్వేషన్‌ విధానం అమలు కానుంది.
-> మొత్తం సీట్లలో సూపర్‌ న్యూమరీగా 10% సీట్లను ఈడబ్ల్యుఎస్ ‌(ఆర్థికంగా వెనకబడిన బలహీనవర్గాలు) కోటాగా కేటాయిస్తారు.
-> ప్రతి కోర్సులోనూ మహిళల కోటా కింద 33.33% వర్తింపజేస్తారు.
-> ఎన్‌సీసీ కోటాలో 1% సీట్లు కేటాయిస్తారు.
-> ఇంటర్‌లో కామర్సు ఒక సబ్జెక్టుగా చదివిన వారికి రాష్ట్రస్థాయిలో బీకామ్‌లో 60% సీట్లు కేటాయిస్తారు.
-> ఇంటర్‌లో సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ చదివిన వారికి.. బీఏ కోర్సుల్లో 50% సీట్లు కేటాయిస్తారు.
చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారిని.. శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాలకు స్థానికులుగా పరిగణిస్తారు.
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిని ఆంధ్రా, ఆచార్య నాగార్జున, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాలకు స్థానికులుగా పరిగణిస్తారు.
ఉన్నత విద్యా సంస్థలను నవంబరు 2 నుంచి తెరవనున్నారు. కొందరు విద్యార్థులకు ఆన్‌లైన్‌.. మరికొందరికి ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు నవంబరు 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM