ఎంఐ 10టీ ఫోన్లు వచ్చేశాయ్..

by సూర్య | Fri, Oct 16, 2020, 12:32 PM

ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో స్మార్ట్ ఫోన్లు ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వన్ ప్లస్ 8టీకి దీటైన స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్లు లాంచ్ అయినప్పటికీ ధర తక్కువగానే ఉండటం విశేషం.
ఎంఐ 10టీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉన్నాయి. కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఎంఐ 10టీ ప్రో ధర
ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వీటి సేల్ ఫ్లిప్ కార్ట్‌లొ రేపటి(అక్టోబర్ 16వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బిలియన్ డేస్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.3,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్‌పై రూ.2000 అదనపు తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఎంఐ 10టీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఎంఐ 10టీ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ను షియోమీ ఇందులో అందించింది. 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్ సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 216 గ్రాములుగా ఉంది.
ఎంఐ 10టీ ప్రో స్పెసిఫికేషన్లు
దీని డిస్ ప్లే, ర్యామ్, ప్రాసెసర్ ఫీచర్లు ఎంఐ 10టీ తరహాలోనే ఉన్నాయి. కెమెరా విషయంలో ఈ ఫోన్ ముందంజలో ఉంది. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఇక కనెక్టివిటీ, బ్యాటరీ ఫీచర్లు కూడా ఎంఐ 10టీ తరహాలోనే ఉన్నాయి. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 218 గ్రాములుగా ఉంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM