పనికి మాలిన ఆషాభూతి మాటలు మాట్లాడటం దురదృష్టకరం : రఘురామకృష్ణ

by సూర్య | Tue, Oct 13, 2020, 03:24 PM

అమరావతి రైతులను చులకను చేస్తూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రాసిన వ్యాసంపై నర్సాపురం ఎంపీ రఘురామరాజు స్పందించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులు ఎంతో త్యాగం చేసి.. దాదాపు దానం చేసినట్టు భూములు ఇస్తే... పనికి మాలిన ఆషాభూతి మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమం చేస్తున్నారని.. అన్ని ఊళ్లలోనూ రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు పలికారన్నారు. అసలు సెక్యురిటీ లేకుండా అసెంబ్లీకి వెళ్లగలరా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. నిజంగా అక్కడున్నవారు మేకప్ ఆర్టిస్టులైతే... అసెంబ్లీకి వెళ్లడానికి ఎందుగు భయపడుతున్నారన్నారు. ‘‘కొంపలోనే ఉంటున్నారు కదా.. ఎందుకు భయపడుతున్నారు. నిస్సిగ్గుగా.. దారుణంగా 30 మందికే పరిమితం అని ఎలా అనగలుగుతారు. అటువంటి ఉద్యమం జరుగుతుంటే.. ఏమీ తెలియనట్టు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యకారులను అవమానించడం ఎంత వరకు సబబు. చిన్న, సన్న కారు రైతులు భూమిలిస్తే.... రైతులను ఈ రకంగా అవమానిస్తారా? సీఎం గారూ.. మీ పేరుతో అవమానిస్తున్నారు. దళితులకు మీకు మధ్య అగాథం పెరిగిపోయింది. మీకైతే ప్రేమ ఉన్నదని ఇన్నాళ్లు నేనూ అనుకున్నాను. డ్రామా, మేకప్ ఆర్టిస్టులంటూ సజ్జల రెడ్డి  విమర్శించడం దారుణం. ప్రజలకు మిమ్మల్ని దూరం చేస్తున్నారు’’ అని వాపోయారు. 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM