మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు..

by సూర్య | Tue, Oct 13, 2020, 02:24 PM

శతాధిక వసంతాల చరిత్ర ఉన్న విజయనగరం మహారాజా కళాశాల (ఎంఆర్ కళాశాల)ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించారు. ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొదట ఎంఆర్ కాలేజి వద్ద ధర్నా నిర్వహించారు. ఆపై ర్యాలీగా మంత్రి బొత్స నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలతో పాటు, జిల్లా నేతలు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఆర్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM