కరోనా నుంచి కోలుకున్న వారిలో షాకింగ్ లక్షణాలు!

by సూర్య | Mon, Oct 12, 2020, 04:51 PM

కొవిడ్-19 సోకి కోలుకున్న చిన్న పిల్లల్లో కొన్ని లక్షణాలు కనబడుతున్నాయని తెలుస్తోంది. కోలుకున్న నలభైఐదు రోజులు తర్వాత కూడా మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ వల్ల పిల్లలు సఫర్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇది చాలా ఇంటెన్స్ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ అనీ రికవర్ అయిన నలభై ఐదు రోజుల తరువాత ఎందుకు వచ్చిందో తెలియటం లేదనీ డాక్టర్లు అంటున్నారు. అలాగే, చిన్న పిల్లల్లో కొవిడ్-19 లక్షణాలు కొంచెం డిఫరెంట్ గా ఉండవచ్చని కూడా తెలుస్తోంది. హై ఫీవర్, ముఖం ఎర్రగా అవ్వడం, కళ్ళు, పెదిమలూ ఎర్రబడడం, కాళ్ళూ చేతుల వాపు, పొట్టకి సంబంధించిన సమస్యలు, కడుపునొప్పి, వాంతులు, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి లక్షణాలను పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. పిల్లలు ఒక షాక్ లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అంటే, బీపీ తగ్గి, బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. కాళ్ళూ చేతులూ చల్లబడిపోవడం వంటివి జరగొచ్చు.


పిల్లల్లో కొవిడ్ రికవరీ తరువాత వచ్చే కేసులు తక్కువే అయినా, పిల్లలు బయటకి వెళ్ళి ఆడుకోవడం, ఇంకొకరితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. కొంత మంది పిల్లలు రికవరీ తరువాత కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, నీరసం తో బాధపడతారని తెలుస్తోంది. మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ చాలా తక్కువ శాతం మంది పిల్లలోనే కనబడినా కూడా, అది గుండె, ఊపిరి తిత్తుల తో పాటూ శరీరం లో చాలా భాగాలని ఎఫెక్ట్ చేయ్యగలదని వారు అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రయోగాలు చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేటట్లుగా డిజైన్ చేస్తున్నారు. అయితే, వైరస్ ని ఇలా కాక, పాయింట్ ఆఫ్ ఎటాక్, అంటే నోరు, ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ల వైపు పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు.


అమెరికా, బ్రిటన్, హాంగ్‌కాంగ్ లో జరుగుతున్న ఈ పరిశోధనల లక్ష్యం ముక్కులోనే ఈ వైరస్ ని పెరగకుండా చేయడం. తద్వారా ఇన్‌ఫెక్షన్ శరీరం లోకి చేరుకుని ఇంకొకరికి కూడా సోకే రిస్క్ బాగా తగ్గుతుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ల వల్ల ఇంకొన్ని ప్రాక్టికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటికి సూదులు అవసరం లేదు, తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేసి పంపించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెల్త్ వర్కర్స్ ఎక్కువ మంది అవసరం ఉండకపోవచ్చు.


హాంగ్‌కాంగ్ లో ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్-19 రెండింటికీ కలిపి పనిచేసే ఒక వ్యాక్సిన్ ని తయారు చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కూడా ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సినే. జంతువుల మీద చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయనీ, హ్యూమన్ టెస్టింగ్ లో మొదటి దశ వచ్చే నెలలో మొదలవుతుందనీ తెలుస్తోంది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్య సమస్యలున్న వారే కాదు, అధిక బరువున్న వారు కూడా ఈ వైరస్ విషయం లో జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఒబేసిటీ వల్ల ఇమ్యూనిటీ బలహీనపడే అవకాశం కూడా ఉందని WHO చెబుతోంది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM
రేపు నామినేషన్ల పరిశీలన Thu, Apr 25, 2024, 06:56 PM
‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌ Thu, Apr 25, 2024, 06:56 PM