మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం కొనే ఛాన్స్..

by సూర్య | Mon, Oct 12, 2020, 02:35 PM

కేంద్ర ప్రభుత్వం పండుగ సీజన్ కు ముందు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోసారి గోల్డ్ బాండ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గోల్డ్ బాండ్లను సోమవారం నుంచి కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం తరుపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గోల్డ్ బాండ్లను విక్రయిస్తోంది. గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు రూ.5,051గా ఉంది. అంటే 10 గ్రాములకు రూ.50,510 అవుతుంది. అదే ఆన్‌లైన్‌లోనే గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముపై రూ.50 డిసౌంట్ లభిస్తుంది. అంటే అప్పుడు మీకు గ్రాము బంగారం ధర రూ.5,001 అవుతుంది. 10 గ్రాములకు చూసుకుంటే రూ.50,010గా ఉంటుంది. సోమవారం నుంచి గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమౌతుంది. అక్టోబర్ 16న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. గోల్డ్ బాండ్లలో డబ్బులు పెట్టే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. వీటి మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. ఐదేళ్ల తర్వాత అవసరం అనుకుంటే బాండ్లను విక్రయించి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.
ప్రస్తుతం బంగారం ధర మార్కెట్‌లో 10 గ్రాములకు రూ.53 వేల సమీపంలో ఉంది. అంటే గోల్డ్ బాండ్ల ధర ఏకంగా రూ.3,000 తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు కనీసం 1 గ్రాము దగ్గరి నుంచి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు మినహాయింపు), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) వంటి వాటిల్లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. అంటే ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో కూడా గోల్డ్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. గోల్డ్ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ వస్తుంది. అంతేకాకుండా గోల్డ్ బాండ్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి. వీటిని డీమ్యాట్ అకౌంట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఎలాంటి జీఎస్‌టీ పడదు. అదే మీరు బంగారం కొంటే జీఎస్‌టీ పడుతుంది. ఇంకా బంగారం ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు.

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM