ఐపీఎల్ 2020: బెంగళూర్- కోల్ కతా సమరంలో గెలుపెవరిది?

by సూర్య | Mon, Oct 12, 2020, 12:03 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు షార్జాలో బెంగళూర్, కోల్ కతా జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మొత్తం 24 మ్యాచులు జరగ్గా, బెంగళూర్ 10, కోల్ కతా 14 మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక తాజాగా షార్జాలో జరుగనున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.


మరో గెలుపు కోసం..


చెన్నైతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన బెంగళూర్ జట్టు మరో మ్యాచ్ గెలవాలని కసితో ఉన్నది. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే బెంగళూర్ యువ క్రీడాకారుడు దేవదత్‌ పడిక్కల్ అదరగొట్టాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చేయలేని పని యువ దేవదత్‌ పడిక్కల్‌ చేసి చూపించాడు. అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. రెండో మ్యాచ్ లో జట్టు ఓటమి పాలైనా టీమ్ నిరుత్సాహంతో లేరు. టాప్‌ ఆర్డర్‌లో పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌ రాకతో రాయల్‌ చాలెంజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సిన అవసరం లేదనే దీమా ఆ జట్టులో కనిపిస్తోంది. ఇక విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ల ప్రదర్శన ఈ సీజన్ లో అంతంత మాత్రంగానే ఉంది. బౌలింగ్‌లో బెంగళూర్‌ జోరుమీదుంది. డెల్‌ స్టెయిన్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.


ఇంకొక్కసారి..


పంజాబ్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు సొగసైన విజయాన్ని నమోదు చేసింది. క్లిష్టమైన సమయాల్లో జట్టు తేరుకునేలా చేయడంలో కెప్టెన్ దినేష్ కార్తీక్ ది అందెవేసిన చెయ్యి. ఒక్కసారిగా మ్యాచ్‌ను తమవైపు తిప్పే బౌలర్లున్న కోల్‌కతా.. వేలంలో కూడా టాలెంటెడ్ ప్లేయర్లను కోల్ కతా వేలంలో దక్కించుకుంది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, అండ్రూ రస్సెల్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు ఆడే బ్యాటింగ్ డెప్త్‌‌ ఉంది. బౌలింగ్‌‌లో సునీల్ నరైన్‌‌, కుల్దీప్‌‌ స్పిన్ మ్యాజిక్‌‌ చేయగలరు. ప్యాట్ కమిన్స్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, శివమ్‌‌ మావి, ప్రసిద్‌‌ కృష్ణతో పేస్‌‌ విభాగం బలంగానే ఉంది.


తుది జట్లు (అంచనా)


రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ :


దేవదత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, శివం దూబె, జోశ్‌ ఫిలిప్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, డెల్‌ స్టెయిన్‌, యుజ్వెంద్ర చాహల్‌.


కోల్‌కతా నైట్ రైడర్స్ :


దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సునిల్‌ నరైన్‌, శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా, మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, కమిన్స్‌, కుల్దీప్‌యాదవ్‌, కమలేశ్‌ నాగర్కోటి, శివం మావి, ప్రసిద్‌ క్రిష్ణ


టీమ్ వివరాలు సంక్షిప్తంగా


టీమ్ పేరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్


కెప్టెన్: విరాట్‌ కోహ్లి


యజమాని: రాయల్‌ చాలెంజర్స్‌ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్


విజేత : -


రన్నరప్ : 2009, 2011, 2016


టీమ్ వివరాలు సంక్షిప్తంగా


టీమ్ పేరు : కోల్‌కతా నైట్ రైడర్స్


కెప్టెన్: దినేష్ కార్తీక్


యజమాని: నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్


విజేత : 2012, 2014


రన్నరప్ : -

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM