మరికాసేప‌ట్లో జీఎస్టీ కౌన్సిల్‌ స‌మావేశం

by సూర్య | Mon, Oct 12, 2020, 09:51 AM

వ‌స్తు, సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) మండ‌లి స‌మావేశంలో మ‌రికొద్ది సేప‌ట్లో ప్రారంభంకానుంది. 42వ కౌన్సిల్ స‌మావేశం గ‌త సోమ‌వారం జ‌రిగింది. అయితే జీఎస్టీ ప‌రిహారం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రితో అది వాయిద‌ప‌డింది. ఇదే విష‌యంపై ఈరోజు జ‌రుగ‌నున్న స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ప‌రిహారం అంశంలో ఏకాభిప్రాయ సాధాన‌కు కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ స‌హా ఇత‌ర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపైకూడా ఈరోజు చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. రాష్ట్రాల రెవెన్యూ లోటుపై మూడోసారి స‌మావేశం జ‌రుగుతున్న‌ది. 


క‌రోనా నేప‌థ్యంలో జీఎస్టీ ప‌రిహారాన్ని చెల్లించ‌మ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ ప్ర‌క‌టించింది. ఈలోటును పూడ్చుకోవ‌డానికి రాష్ట్రాలు ఆర్బీఐ వ‌ద్ద అప్పు తీసుకోవాల‌ని సూచించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను బీజేపీయేత‌ర రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నాయి. దీనివ‌ల్ల తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని కేంద్ర‌మే అప్పుతీసుకుని రాష్ట్రాల‌కు ఇవ్వాల‌ని ప‌శ్చిమ‌బెంగాల్‌, తెలంగాణ‌, పంజాబ్‌, కేర‌ళతోపాటు మ‌రికొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈసారి స‌మావేశం వాడివేడిగా జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జ‌రుతున్న ఈ స‌మావేశానికి రాష్ట్రాల ఆర్థిక‌మంత్రులు వ‌ర్చువ‌ల్ వేదిక‌గా హాజ‌రుకానున్నారు.    

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM