ఐపీఎల్ 2020: పంజాబ్- కోల్ కతా సమరంలో గెలుపెవరిది?

by సూర్య | Sat, Oct 10, 2020, 02:27 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు అబుదాబి లో పంజాబ్, కోల్ కతా జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచులు జరగ్గా, పంజాబ్ 8, కోల్ కతా 17 మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక తాజాగా అబుదాబిలో జరుగనున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.


పరువు కోసం..


ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైన పంజాబ్, గత మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. కనీసం ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఉవ్విల్లూరుతున్నది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్నిమూటగట్టుకున్న జట్టుకు ఈసారి ఎలాగైనా విజయాన్ని అందించాలని కెప్టెన్ లోకేష్ రాహుల్ సహచర కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ తోడుగా రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. అయితే బెంగళూర్ మ్యాచ్ లో లెక్క సరిచేశారు. ఆ తరువాత కొంచం తడబడుతున్నా.. తమాయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో క్రిస్‌ జోర్డాన్‌పై పంజాబ్‌ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. పేసర్‌ మహ్మద్‌ షమి శత్రు దుర్భేద్య అస్త్రాలతో సన్న ద్ధంగా ఉన్నాడు. అతడికి కృష్ణప్ప గౌతమ్‌, షెల్డన్‌ కాట్రెల్‌ సహకరిస్తే జట్టు విజయం సాధించవచ్చు.


మరో గెలుపు కోసం..


దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచి, రెండు ఓడింది. చెన్నైతో ఆడిన ఆఖరి మ్యాచ్ లో సొగసైన విజయాన్ని నమోదు చేసింది. జట్టు తేరుకునేలా చేయడంలో కెప్టెన్ దినేష్ కార్తీక్ ది అందెవేసిన చెయ్యి. ఒక్కసారిగా మ్యాచ్‌ను తమవైపు తిప్పే బౌలర్లున్న కోల్‌కతా.. వేలంలో కూడా టాలెంటెడ్ ప్లేయర్లను కోల్ కతా వేలంలో దక్కించుకుంది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, అండ్రూ రస్సెల్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు ఆడే బ్యాటింగ్ డెప్త్‌‌ ఉంది. బౌలింగ్‌‌లో సునీల్ నరైన్‌‌, కుల్దీప్‌‌ స్పిన్ మ్యాజిక్‌‌ చేయగలరు. ప్యాట్ కమిన్స్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, శివమ్‌‌ మావి, ప్రసిద్‌‌ కృష్ణతో పేస్‌‌ విభాగం బలంగానే ఉంది.


తుది జట్లు (అంచనా)


కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ :


కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, క్రిస్‌ జోర్డాన్‌, కృష్ణప్ప గౌతమ్‌, ముజీబ్‌ రెహమాన్‌, రవి బిష్ణోరు, మహ్మద్‌ షమి.


కోల్‌కతా నైట్ రైడర్స్ :


దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సునిల్‌ నరైన్‌, శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా, మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, కమిన్స్‌, కుల్దీప్‌యాదవ్‌, కమలేశ్‌ నాగర్కోటి, శివం మావి, ప్రసిద్‌ క్రిష్ణ


టీమ్ వివరాలు సంక్షిప్తంగా


టీమ్ పేరు : కింగ్స్ ఎలెవన్ పంజాబ్


కెప్టెన్: కెఎల్‌ రాహుల్‌


యజమాని: కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్


విజేత : -


రన్నరప్ : 2014


టీమ్ వివరాలు సంక్షిప్తంగా


టీమ్ పేరు : కోల్‌కతా నైట్ రైడర్స్


కెప్టెన్: దినేష్ కార్తీక్


యజమాని: నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్


విజేత : 2012, 2014


రన్నరప్ : -

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM