రైల్వే ప్రయాణికులకు గమనిక.. నేటి నుంచి కొత్త రిజర్వేషన్ రూల్స్

by సూర్య | Sat, Oct 10, 2020, 12:09 PM

పండుగ సీజన్ వచ్చేసింది. దూర ప్రాంతాల నుంచి సొంతూరుకి వెళ్లేందుకు రైలు ప్రయాణాలను చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులు రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే ప్రయాణాల కోసం ప్లాన్ చేసుకున్నారా? అయితే టికెట్ బుక్ చేసే ముందు ఇండియన్ రైల్వే కొత్త రూల్స్ తెలుసుకోవడం కాస్త మంచిది. శనివారం నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అవేంటో తెలుసుకోండి.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ భారతీయ రైల్వే అని అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఈ వ్యవస్థ కొన్ని రోజుల పాటు స్తంభించిపోయింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో బారతీయ రైల్వే రైళ్లను పరిమితంగా నడుపుతోంది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది. ఈ సందర్భంగా టికెట్ బుకింగ్, రిజర్వేషన్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఇన్నాళ్లూ కేవలం ఒకే రిజర్వేషన్ చార్టును మాత్రమే ప్రిపేర్ చేసేది భారతీయ రైల్వే.
ఇకపై గతంలోలాగా రెండో రిజర్వేషన్ చార్టును ప్రిపేర్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైలు బయల్దేరడానికి ముందు 30 నుంచి 5 నిమిషాలలోపు రెండో రిజర్వేషన్ చార్ట్‌ను ప్రిపేర్ చేయనుంది రైల్వే. పాత పద్ధతి ప్రకారం రెండో రిజర్వేషన్ చార్టును అక్టోబర్ 10 నుంచి ప్రిపేర్ చేయనుంది భారతీయ రైల్వే. రెండో చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేయొచ్చు. రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతి ప్రకారమే 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది.
గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు గంటల ముందు చార్టును ప్రిపేర్ చేసేది భారతీయ రైల్వే. ఈ పద్ధతి కొన్ని నెలల పాటు ఇలాగే ఉంది. ఇక మొదటి రిజర్వేషన్ చార్ట్ రైలు బయల్దేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. మొదటి చార్టులో ఖాళీగా ఉన్న బెర్తుల్ని ప్రయాణికులు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయ్యే లోగా ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
ఇక అప్పటికే బుక్ చేసిన రైలు టికెట్లను క్యాన్సల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న రీఫండ్ రూల్స్ వారికి వర్తిస్తాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయాయి. మే 1న శ్రామిక్ రైళ్లను నడపడం ద్వారా రైల్వే సేవల్ని పునరుద్ధరించారు. అప్పట్నుంచి దశలవారీగా రైళ్ల సంఖ్యను పెంచుతోంది ఇండియన్ రైల్వే.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM