ప్రియురాలి కోసం స్నేహితుడిపై హత్యాయత్నం

by సూర్య | Sat, Oct 10, 2020, 11:36 AM

గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా ఓ వక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించడం.. వారి మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఓ వ్యక్తి స్నేహితుడినే అంతమొందించాలని చూశాడు. ఈ క్రమంలో అతనితో పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్‌, యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ మంచి స్నేహితులు. ప్రేమ్‌చంద్‌కు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అయితే తన వద్ద ఫోన్ లేకపోవడంతో ప్రేమ్‌చంద్.. గోపి సాయం తీసుకున్నాడు. గోపి ఫోన్ నుంచే ఆ మహిళతో మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే గోపి కూడా ప్రేమ్‌చంద్ మాట్లాడే మహిళతో పలుమార్లు మాట్లాడారు.


 


అయితే ఈ విషయం ప్రేమ్‌చంద్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల తనకు తెలియకుండా గోపి కూడా ఆ మహిళతో మాట్లాడినట్టుగా ప్రేమ్‌చంద్ గుర్తించాడు. ఈ విషయంపై గోపిని ప్రేమ్‌చంద్ నిలదీయడంతో వారి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీన ఇద్దరూ ఈ విషయానికి సంబంధించి గొడపపడ్డారు. అప్పుడే ప్రేమ్‌చంద్‌కు ఓ దురాలోచన వచ్చింది. తన ప్రియురాలితో మాట్లాడుతునన గోపిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్లాన్‌ను అమలు చేశాడు.


ఆ రోజు రాత్రే గోపిని కలవాలని కబురు పంపాడు. పథకం ప్రకారం గోపిని యడ్లపాడు-నాదెండ్ల మార్గంలోని చప్టా వద్దకు పిలిపించాడు. అక్కడ ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను గోపి చేత తాగించాడు. అతను కూల్ డ్రింక్ తాగాక అసలు విషయం చెప్పాడు. దీంతో గోపి ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గోపి ఆరోగ్యం క్షీణించడంతో.. ఈ నెల 7వ తేదీన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ ఘటనకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM