దసరాకు ప్రత్యేక రైళ్లు..

by సూర్య | Sat, Oct 10, 2020, 10:10 AM

భారతీయ రైల్వే దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వేర్వేరు జోన్లలో 39 స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. వీటిలో ఏసీ ఎక్స్‌ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ధి లాంటి రైళ్లు ఉన్నాయి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 39 రైళ్ల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 


 దసరా, దీపావళి సందర్భంగా భారతీయ రైల్వే నడిపే 39 ప్రత్యేక రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లు కూడా ఉన్నాయి. ఆ రైళ్ల జాబితా, రూట్లు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం) 3. దసరా, దీపావళి సందర్భంగా భారతీయ రైల్వే నడిపే 39 ప్రత్యేక రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లు కూడా ఉన్నాయి. ఆ రైళ్ల జాబితా, రూట్లు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకోండి. 


 రైలు నెంబర్ 02774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు ప్రతీ మంగళవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 13 నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, రాయనపాడు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. 


 


రైలు నెంబర్ 02773 షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ బుధవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 14 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్‌లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, రాయనపాడు, వరంగల్ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)


 


 


రైలు నెంబర్ 02708 తిరుపతి నుంచి విశాఖపట్నం వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 14 నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఆగుతుంది. (Source: South Indian Railways)

Latest News

 
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు Wed, Apr 24, 2024, 08:57 PM