రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే

by సూర్య | Fri, Oct 09, 2020, 06:44 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు రోడ్డుపై బైఠాయించారు. జిల్లాలోని కాళ్ళ మండలం సీసలిలో రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకూ ఇక్కడ్నుంచి కదలనని ఆయన రోడ్డుపై బైఠాయించారు. కాగా.. గుంతలు పడిన రోడ్లను మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాళ్లు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ధర్నాకు దిగారు.


హామీ ఇచ్చిన అధికారులు


అయితే.. ఎమ్మెల్యే దీక్షకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. పది రోజుల్లో రోడ్లు మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారుల హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే మంతెన నిరసన విరమించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు ఆయనకు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్యే రోడ్డుపైనే బైఠాయించారు. అధికారులొచ్చి హామీ ఇచ్చిన తర్వాతే కొద్దిసేపటి క్రితం దీక్ష విరమించుకున్నారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 09:00 PM
ఏపీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. చంద్రబాబుపై చర్యలకు ఈసీకి సిఫార్సు Tue, Apr 23, 2024, 08:55 PM
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM
సీఎం జగన్ పై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 08:08 PM
జగన్ రాష్ట్రానికి చేసిందేమిలేదు Tue, Apr 23, 2024, 08:08 PM