వ్యవసాయ బిల్లుతో రైతులు అపరిమిత ప్రయోజనాలు పొందుతారు : జీవీఎల్

by సూర్య | Thu, Oct 08, 2020, 03:59 PM

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల మిర్చి, ఇతర సుగంధ ద్రవ్యాల  బోర్డు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ గుంటూరు విచ్చేశారు. మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ హోదాలో మొట్టమొదటిగా సారిగా గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి పంట గురించి, ధరల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో జీవీఎల్ సమావేశం నిర్వహించారు. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులు అపరిమిత ప్రయోజనాలు పొందుతారని ఆయన వివరించారు.


అంతకుముందు జీవీఎల్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లారు. కన్నాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై కాసేపు చర్చించుకున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM