ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పిల్లలందరికీ జగన్ మేనమామగా మారారు : ఆదిమూలపు సురేశ్

by సూర్య | Thu, Oct 08, 2020, 01:28 PM

అమ్మఒడి పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి పెద్దన్నలా నిలిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కాసేపటి క్రితం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకోలేదని... వైసీపీ అధికారంలోకి వచ్చాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.


విద్యాకానుక పథకం ద్వారా రాష్ట్రంలోని పిల్లలందరికీ జగన్ మేనమామగా మారారని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యాకానుక పథకం ద్వారా రూ. 650 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి రూ. 1600 విలువైన కిట్ ను అందిస్తున్నామని తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM