ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..!

by సూర్య | Thu, Oct 08, 2020, 12:26 PM

ఏపీ సర్కార్ నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 2842 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్కువగా మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి. 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు.
పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి. దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇవ్వాలి. నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పోస్టులకు అక్టోబర్‌ 12, పశ్చిమ గోదావరి జిల్లా పోస్టులకు 14, మిగిలిన జిల్లాల్లో ఈనెల 10 దరఖాస్తుకు చివరితేది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం - 229, విజయనగరం - 217, విశాఖపట్నం - 322, తూర్పు గోదావరి - 326, పశ్చిమ గోదావరి - 159, కృష్ణా - 171, గుంటూరు - 160, ప్రకాశం - 194, నెల్లూరు - 76, చిత్తూరు- 194, కడప- 296, కర్నూలు - 322, అనంతపురం - 176 ఖాళీలున్నాయి.

Latest News

 
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM
నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు Fri, Apr 19, 2024, 07:32 PM