పాతపథకానికి కొత్త సోకు కాదా? : దేవినేని ఉమా

by సూర్య | Thu, Oct 08, 2020, 11:55 AM

ఏపీ సర్కార్ పై  టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విమర్శలు గుప్పించారు. బడి విద్యార్థుల కోసం ‘జగనన్న విద్యా కానుక’ ప‌థ‌కాన్ని సీఎం వైఎస్‌ జగన్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించనున్న విష‌యం తెలిసిందే. కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హైస్కూలులో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను ఆయ‌న‌‌ అందించనున్నారు. దీనిపై దేవినేని ఉమ స్పందించారు.


'పాఠ్యపుస్తకాలు, షూ, యూనిఫాం, కుట్టు కూలి టీడీపీ హయాంలో ఇచ్చినవే. ఢిల్లీ, కేరళలో ఇంకా మెరుగ్గా పథకం.. ఇంటికే బుక్స్ పంపిన కేరళ.. చంద్ర‌బాబు ఉచితసైకిల్ పథకానికి మంగళం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు. పాతపథకానికి కొత్త సోకు కాదా? ఖర్చుపెట్టిన కోట్లన్ని రివర్స్ టెండరింగ్ లోనే ఇచ్చారా?   వైఎస్ జ‌గ‌న్' అంటూ దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.  


ఈ సంద‌ర్భంగా ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన  క‌థ‌నాన్ని ఆయ‌న పోస్ట్ చేశారు. పాత పథకానికే కొత్త పేరు పెట్టార‌ని, ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చు రూ.1500 మాత్ర‌మేన‌ని అందులో పేర్కొన్నారు. పాఠ్య పుస్తకాలు, షూ, సాక్సులు, యూనిఫాం గతంలోనూ పంపిణీ చేశార‌ని, కొత్తగా బెల్టు, బ్యాగ్‌, టై, వర్క్‌బుక్స్ తాము మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటనలు చేసుకుంటున్నార‌ని అందులో ఉంది. 

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM