రామేశ్వరం నుంచి అయోధ్యకు చేరిన భారీ గుడిగంట

by సూర్య | Thu, Oct 08, 2020, 11:31 AM

రామజన్మభూమి ఆలయం కోసం తమిళనాడులోని రామేశ్వరంలో సిద్ధంచేసిన 613 కిలోల గంట బుధవారం అయోధ్యకు చేరింది. కంచుతో తయారైన ఈ భారీ గంటను మోగిస్తే ‘ఓం’ అన్న శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. ఈ మేరకు తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన భక్తురాలు రాజ్యలక్ష్మి ప్రత్యేక వాహనంలో గంటను అయోధ్యకు తీసుకెళ్లారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు బుధవారం అందజేశారు. ఈ గంటను భవ్య రామమందిరంలో ఏర్పాటుచేస్తామని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. ‘‘రాముడి ఆలయానికి గంటను బహూకరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ మహత్తర కార్యంలో నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని రాజ్యలక్ష్మి చెప్పారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM