పోలీసులకు, నేరస్థులకు మధ్య ఎదురుకాల్పులు

by సూర్య | Thu, Oct 08, 2020, 09:47 AM

ఢిల్లీలోని బేగంపూర్‌లో పోలీసులకు, నేరస్థులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు నేరస్థులు గాయపడ్డారు. స్పెషల్ సెల్ పోలీసుల కథనం ప్రకారం.. వాంటెడ్ నేరస్థులు లారెన్స్ బిష్ణోయి కాలా జాతేడి గావ్ గ్యాంగ్‌కు చెందినవారు. ఎదురుకాల్పుల్లో రోహిత్, అమిత్, రవీందర్ యాదవ్, సునీల్ అనే నలుగురు నేరస్థులు బుల్లెట్‌ గాయాలయ్యాయి. వీరి చికిత్స కోసం వారిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా నిందితులు వాహనం నడుపుతున్న కారుతో పాటు నాలుగు ఆటోమేటిక్ పిస్టల్స్, 70 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, 10 లైవ్ కార్ట్రిడ్జ్‌లతో రెండు దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్, మూడు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ఒక్కొక్కటి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


 


ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కదలికకు సంబంధించి నిర్ధిష్ట సమాచారం అందడంతో ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఖేరా గావ్‌పై సెక్టార్ 26 రోహిణిలో వారిని పట్టుకునేందుకు ప్లాన్‌ చేశారు. గురువారం తెల్లవారు జామున 3:30 గంటలకు నేరస్థులతో ఉన్న కారు అక్కడికి చేరుకోగా.. పట్టుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు దొరకకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తూ పోలీసులపై పోలీసులపై నేరస్థులు 22 రౌండ్ల వరకు కాల్పులకు తెగబడడంతో.. దీంతో పోలీసులు సైతం 28 రైండ్లు కాల్పులు జరిపారు. దీంతో గాయాలై పడిపోవడంతో వారిని పట్టుకొని దవాఖానకు తరలించారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, కాల్పులు తదితర డజనుకుపైగా కేసుల్లో సదరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM