కరోనాతో త్వరలో ఆర్థిక ప్రళయం

by సూర్య | Wed, Oct 07, 2020, 03:42 PM

15 కోట్ల మంది 2021 నాటికి చేతిలో రూపాయి లేని పరిస్థితి (అత్యంత తీవ్ర పేదరికం)కి వచ్చేస్తారని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. దీనికి కారణం కరోనా వైరస్సే. ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో... ప్రపంచ దేశాల్లో ప్రజలు... ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలూ మానేసి... వేరేవేరేవి వెతుక్కున్నారు. అలా మారలేని వాళ్లు... అలాగే ఉండిపోతూ... అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 2021లో కరోనాకి టీకా వచ్చేస్తుంది కాబట్టి... ఇక అంతా సెట్ అయిపోతుందని అనుకోవద్దని ప్రపంచ బ్యాంక్ అంటోంది. ఎందుకంటే... కరోనా తర్వాతి ప్రపంచంలో... టెక్నాలజీ వాడకం పెరిగి... సంప్రదాయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గాల్లో కలిసిపోతాయట. అంటే రోజువారీ కూలిపనులు చేసుకునే పేదవాళ్లకు ఉపాధి అవకాశాలు పోయినట్లే అంటోంది ప్రపంచ బ్యాంక్. ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచ దేశాలు కకావికలం అయ్యాయి. ఆర్థిక వ్యవస్థలు నేల చూపులు చూస్తున్నాయి. ఇండియా లాంటి పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు కూడా దిగాలుగా ఉన్నాయి. ఇది చాలనట్లు మరో 8.8 కోట్ల మంది నుంచి 11.5 కోట్ల మంది వరకూ తీవ్రమైన పేదరికంలోకి జారుకుంటారని ప్రపంచ బ్యాంక్ అంటోంది. అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో చాలా కంపెనీలు ఇప్పటికే... కార్మికుల స్థానంలో రోబోలు, మర యంత్రాల్ని దింపి... వాటితోనే పనులు చేయించుకుంటున్నాయి. మరి రోజు కూలీతోనే బతుకు బండి లాగించే వారి పరిస్థితేంటి? వారికి ఉపాధి ఎలా?


"కరోనా వల్ల వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం... ప్రపంచ జనాభాలో 1.4 శాతం మందిపై తీవ్రంగా ఉంది. వారంతా తీవ్ర దారిద్ర్యంలోకి వెళ్తారు" అని ప్రపంచ బయాక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తెలిపారు. "ఈ పరిస్థితి నుంచి పేదల్ని కాపాడాలంటే... కరోనా పోయిన తర్వాత ప్రభుత్వాలు... పేదరికాన్ని తగ్గించే దిశగా... సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకెళ్లాలి. ఆ పరిస్థితుల్లో... కొత్త వ్యాపారాలు రావాలి, కొత్త ఇన్నోవేషన్ జరగాలి. అదే సమయంలో... పెట్టుబడులు రావాలి, కార్మికులకు ఉద్యోగాలు రావాలి, వారి స్కిల్స్ పెరగాలి" అని ఆయన సూచించారు. మరో షాకింగ్ విషయమేంటంటే... భారత్ లాంటి దేశాల్లో ఈ కరోనా వల్ల ఆల్రెడీ పేదరికం విపరీతంగా పెరిగింది. మధ్య ఆదాయ దేశాల్లో 82 శాతం మంది ఇప్పటికే తీవ్ర దారిద్ర్యంలో ఉన్నారని ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ తెలిపింది. 2030 నాటికి ప్రపంచంలో పేదరికాన్ని 7 శాతానికి తగ్గించాల్సిన లక్ష్యం ఉందన్న ప్రపంచ బ్యాంక్... భారత్‌ సహా చాలా దేశాల్లో పేదరికం ఇప్పుడు ఎలా ఉందన్న అంశంపై సరైన డేటా తమ దగ్గర లేదని తెలిపింది. అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని తెలిపింది.

Latest News

 
అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కరిస్తాం Wed, Apr 24, 2024, 12:42 PM
భీమిలిని నెంబర్ వన్ గా తీర్చిదుద్దుతా... Wed, Apr 24, 2024, 12:41 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Wed, Apr 24, 2024, 12:37 PM
హిందూపురంలో ముగ్గురు నామినేషన్లు Wed, Apr 24, 2024, 12:27 PM
వైభవంగా శ్రీ అంబమ్మ దేవి రథోత్సవంలో Wed, Apr 24, 2024, 12:25 PM