కరోనా వైరస్‌కు పండ్లతోనే చెక్...!

by సూర్య | Sun, Mar 29, 2020, 02:45 PM

 ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ సోకితే దాని నుంచి విముక్తి పొందేందుకు ఎలాంటి మందులు, వ్యాక్సిన్లు లేవని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్‌ నివారణకు టీకా కనుగొనే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. వివిధ దేశాల సైంటిస్టులు పరిశోధనల్లో నిమగ్నమైవున్నారు. ఇలాంటి తరుణంలో ఈ వైరస్ బారినపడుకుండా ఉండాలంటే ఏకైక మార్గం... శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమేనట. ఈ కారణంగానే చాలా మంది ఈ వైరస్ బారినపడినవారు కూడా తిరిగి కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. వివిధ దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గినవారే కరోనాకు బలవుతున్నారు. అందువల్ల కరోనాపై పోరాడటానికి శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోవడమే ఉత్తమమార్గమని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందువల్ల యాంటి ఆక్సిడెంట్లు, సి-విటమిన్‌, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. విటమిన్‌-సీని సమృద్ధిగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, యాంటి ఆక్సిడెంట్ల వల్ల శరీరంలో పేరుకుపోయిన రసాయన వ్యర్థాలు తొలగిపోతాయని తెలుపుతున్నారు. నిమ్మజాతి పండ్లు, ఆకు పచ్చని కూరగాయల్లో సి-విటమిన్‌, ఇతర పోషకాలు లభిస్తాయని, తక్కువ ధరకే లభించే ఈ ఆహార పదార్థాలతో కరోనాపై సగం విజయం సాధించవచ్చని వైద్యుల సలహా ఇస్తున్నారు.

Latest News

 
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య Sat, Apr 20, 2024, 01:05 PM
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం Sat, Apr 20, 2024, 12:53 PM
23న చీరాలలో షర్మిల రోడ్ షో... ఆమంచి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:51 PM
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM