కరోనా సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయి.? తప్పక చదవండి..

by సూర్య | Sun, Mar 29, 2020, 02:20 PM

ఇప్పుడు దేశంతోపాటూ... ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముఖ్యమైన అంశం ఏదంటే... కరోనా వైరస్సే అని మనం చెప్పుకోవచ్చు.


 


దానిపై మనం ఎన్నో వార్తలు చదువుతున్నాం. అది సోకితే చనిపోతారనే ప్రచారం బాగా సాగుతోంది. అది నిజంకాదు.


 


ఇప్పటివరకూ ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో... 18 శాతం మంది మాత్రమే చనిపోయారు.


అందువల్ల మనం భయాలను పక్కన పెట్టి... అసలా వైరస్ మన బాడీలో ప్రవేశిస్తే... ఏ రోజు ఏం చేస్తుందో, ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.దీని వల్ల లాభమేంటంటే... అలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే... వెంటనే అలర్ట్ అవ్వొచ్చు. ప్రారంభంలోనే వైరస్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటే... అది నయం అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి.


డే 0 - వికారంగా అనిపిస్తుంది. దీనికి జీరో డే ఎందుకన్నానంటే... ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.


డే 1 - ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి... ఇతర సమస్యల్ని పెంచుతుంది. (సో, జ్వరం వస్తే మీరు అలర్ట్అవ్వాల్సిందే)


డే 2 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.


డే 3 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.


డే 4 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.


డే 5 - ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. (ముసలి వారు, ఆల్రెడీ శ్వాస సమస్యలు ఉన్నవారికి మరింత ఎక్కువ ఇబ్బందిఉంటుంది) (పై లక్షణాలు కంటిన్యూ అవుతాయి)


డే 6 - డే 5 లాగే ఉంటూ... పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.


డే 7 - మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే... పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. పై లక్షణాలన్నీ మరింత పెరుగుతాయి.


డే 8 - ఈ సమయంలో... ఏఆర్ డీఎస్ అనే సమస్య ఏర్పడుతుంది. అంటే... ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.


డే 9 - ఏఆర్ డీఎస్ సమస్య మరింత పెరుగుతుంది.


డే 10 - పేషెంట్‌ని ఐసీయూలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.


డే 17 - మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి... డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.


ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదని అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే... మొదటి 5 రోజుల్లోనే వాళ్లను ఆస్పత్రిలో చేర్చితే... కచ్చితంగా బతికే అవకాశాలు 88 శాతం ఉంటాయి.


అందుకు అందరం అలర్ట్‌గా ఉండాలి. అందర్ని గమనిస్తూ ఉంటే... అవసరమైన సమయంలో వాళ్లను అప్రమత్తం చెయ్యొచ్చు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM