బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అలా చెప్పలేదు...!

by సూర్య | Sun, Mar 29, 2020, 02:20 PM

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం గురించి సోషల్​ మీడియాలో వదంతులు షికార్లు చేస్తున్నాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ మేనేజర్‌ ఈశ్వరయ్యచారి అన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆలయ మేనేజర్‌ ఈశ్వరయ్యచారి ఖండించారు. ‘‘ఆలయంలో పూజారి చనిపోయాడని వస్తున్న వార్త అవాస్తవం. మిరియాలు, అల్లం, బెల్లం కలిపిన నీటిని తాగితే కరోనాను నివారించవచ్చని బ్రహ్మంగారు చెప్పినట్టుగా సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదు. అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి కథనాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దీనిపై రాష్ట్ర డీజీపీ, కడప ఎస్పీకి ఫిర్యాదు లేఖలు పంపుతున్నాం’’ అని స్పష్టం చేశారు.

Latest News

 
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం Sat, Apr 20, 2024, 12:53 PM
23న చీరాలలో షర్మిల రోడ్ షో... ఆమంచి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:51 PM
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM
పెద్దాపురంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు Sat, Apr 20, 2024, 12:49 PM