ఏపీలో కరోనా కల్లోలం: గ్రామ వాలంటీర్లే లేకపోతే....

by సూర్య | Sun, Mar 29, 2020, 01:39 PM

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది. దాంతో కరోనా వైరస్ పేరు వింటేనే చాలు ప్రజలు భయంతో హడలిపోతున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సామాజిక దూరం పాటించాలంటూ పదేపదే హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు కరోనా వైరస్ వచ్చిందని అపోహలు వినిపిస్తే చాలు ప్రజలు వారిని దూరం పెడుతున్నారు. కనీసం దగ్గు, జలుబు వచ్చినా చాలు వారిని దూరం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లోకి ఆప్యాయంగా ఆహ్వానించేవారే ముఖంపైనే తలుపులు వేసేస్తున్న పరిస్థితి. కరోనా సోకిందంటే చాలు బంధాలు..అనుబంధాలు కూడా దూరమై పోతున్నాయి. అండగా ఉంటారనుకున్న వారు సైతం ఆమడ దూరం వెళ్లిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ అండగా నిలుస్తున్నారు వారు. తమ బంధువు కాదు...తమ సొంతవాళ్లు కాదు అయినప్పటికీ ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇంకెవరు గ్రామ వాలంటీర్లు. ఏపీ సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో ఆపన్న హస్తంలా మారారు. ఎలాంటి విపత్కర సమయాల్లోనైనా తాము ఉన్నామంటూ తర తమ భేదం లేకుండా అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో గ్రామ వాలంటీర్లు చేసిన కృషి ప్రశంసలు వినిపిస్తున్నాయి. గ్రామవాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి విదేశాల నుంచి తిరిగి వచ్చిన 10వేల మందిని గుర్తించారు. వారిలో140 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించగా...9,860 మందిని హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు గ్రామ వాలంటీర్లు హాట్ టాపిక్ గా నిలిచారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిర్వహించడంతోపాటు ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులోనూ వాలంటీర్లు చేస్తున్న కృషిని అంతా అభినందిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అంతా వైరస్ భయంతో ఇంటికే పరిమితమైన వాలంటీర్లు మాత్రం ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయడంతో పాటు సర్వే చేయడం, హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీరి సేవలను జాతీయ మీడియా సైతం ప్రశంసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయించారు. మహమ్మారి కరోనా వైరస్‌ కేరళపై విజృంభిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కరోనా వైరస్‌ నివారణకు గ్రామ స్థాయిలో సేవకులుగా 2 లక్షల 36 వేల వాలంటీర్లును వెంటనే నియమించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామ సేవకులను గ్రామాల్లోనే కాకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కూడా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం గ్రామసేవకుల రిక్రూట్మెంట్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. మరోవైపు గ్రామ వాలంటరీ వ్యవస్థపై పలు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గ్రామ వాలంటీర్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటికే 2 లక్షల 80 వేల గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. వారందరినీ కరోనాపై పోరుకు సహాయకులుగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలోనే కొన్ని చోట్ల వాలంటీర్లు సక్రమంగా పనిచేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. వారు కూడా సక్రమంగా విధులు నిర్వహించి ప్రజల సేవలందించాలని ఆయా ప్రాంతాల వారు కోరుకుంటున్నారు. మెుత్తానికి సీఎం జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు రావడం జగన్ సర్కార్ హర్షం వ్యక్తం చేస్తోంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM