కరోనా టీకా తయారీకి ముందడుగు

by సూర్య | Sun, Mar 29, 2020, 12:05 PM

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు,సీనియర్ వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దానికి మందు కనిపెట్టేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ హెచ్ సీయూ అధ్యాపకురాలు సీమా మిశ్రా సాఫ్ట్ వేర్ సాయంతో వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఎపిటోప్స్ రూపొందించారని తెలుపుతూ హెచ్ సీయూ ఒక ప్రకటన విడుదల చేసింది. సీమా హెచ్ సీయూలో బయో కెమిస్ట్రీ విభాగం ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ఆమె తయారు చేసిన టీసెల్ ఎపిటోప్స్ కరోనా ప్రోటీన్లకు వ్యతిరేకంగా పని చేస్తాయి. సీమా రూపొందించిన డిజైన్ల ద్వారా వైరస్ కు చుట్టూ ఉండే ప్రోటీన్ల పై ప్రయోగించి వాటిని నాశనం చేయవచ్చు. ఈ ప్రోటీన్లు కేవలం వైరస్ ప్రోటీన్ల పైనే పని చేస్తాయి. మనిషి ప్రోటీన్ల పై దుష్ప్రభావం చూపవు. టీసెల్ ఎపిసోప్స్ తో పది రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. ప్రయోగ సమయంలో ఎపిటోప్స్ పనితీరు ఆధారంగా కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ తయారీ ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తయారీకి సమయం,డబ్బు అవసరమని హెచ్ సీయూ తెలిపింది. ఎపిటోప్స్ డిజైన్లకు సంబంధించిన ఆన్ లైన్ అధ్యయనాన్ని కెమ్ రిక్సిన్ అనే జర్నల్ కు సీమా పంపారు. సీమ తయారు చేసిన ఎపిటోప్స్ ద్వారా కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్ తయారీకి అడుగులు పడినట్టేనని పలువురు నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్ తయారీ ఎలా ఉన్నా అప్పటి వరకు ప్రజలంతా నిబంధనలు పాటించాలని హెచ్ సీయూ కోరింది.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM