కరోనా ఎఫెక్ట్... జియో యూజర్లకు శుభవార్త..

by సూర్య | Sun, Mar 29, 2020, 11:58 AM

కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ టెల్కో రిలయన్స్ జియో తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా లాక్ డౌన్ , ఇతర ఆంక్షల కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారికోసం రిలయన్స్ జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్' ను ప్రారంభించింది. తాజాగా లాంచ్ చేసిన రూ. 251 ప్లాన్ లో వినియోగదారులు రోజుకు జీబీ 4జీ డేటాను పొందవచ్చు. అంతేకాదు 100 శాతం డేటా వినియోగం పూర్తయిన తర్వాత, వినియోగదారులు 64 కేబీపీఎస్ తక్కువ వేగంతో ఇంటర్నెట్ డేటాను అపరిమితంగా మిగిలిన రోజులో కూడా ఉపయోగించడం కొనసాగించవచ్చు. అయితే లిమిట్ దాటిన తరువాత డేటా బ్రౌజింగ్ కు మాత్రమే పరిమితం. వీడియోలు ప్లే కావు. 120 జీబీ దాకా డేటాను వాడుకోవచ్చు. 51 రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంటుంది. అయితే దీనికి వాయస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు లభించవు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM