ఉద్యోగులకు ఊరటనిచ్చిన కేంద్ర నిర్ణయం...

by సూర్య | Sun, Mar 29, 2020, 11:51 AM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని నివారించేందుకు కేంద్రం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించేలా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ను ఉద్యోగులు తిరిగి తీసుకునేందుకు ఆర్థిక శాఖ అవకాశం ఇచ్చింది. దాని ప్రకారం ఉద్యోగి మూడు నెలల మూలవేతనం, డీఏ తీసుకోవచ్చు లేదా కనీస నిల్వ నుంచి 75 శాతం వరకు తీసుకోవచ్చు. ఈ రెండు మొత్తాల్లో ఏది తక్కువైతే ఆ మొత్తం తీసుకోవచ్చు. ఈపీఎఫ్ డబ్బు కావాలనుకున్నవారు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాన్ని పరిశీలించి... డబ్బు తీసుకునే అవకాశం కల్పిస్తారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM