ఏసీల వల్ల కరోనా వస్తుందా?

by సూర్య | Sat, Mar 28, 2020, 05:54 PM

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలా మంది ఏసీలు వాడటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమికట్టే ప్రయత్నంలో అందరూ లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఎయిర్ కండిషనర్లు అనేవి ఇళ్లలో కరోనావైరస్ వ్యాప్తిని పెంచుతాయని చాలా మందికి సందేహం ఉంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హోమ్ ఎసి యూనిట్లు కోవిడ్ -19 ను వ్యాప్తి చేయవు. ఏదేమైనా, కరోనావైరస్ అనేది చల్లటి ప్రదేశాలలో వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ మాల్స్, కొన్ని అపార్టుమెంట్లలో లేదా ఏసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కరోనా సోకిన వ్యక్తి వెళ్లి ఉంటే ఆ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుంది.


ఈ వైరస్ సాధారణ జలుబు మరియు ఫ్లూ కారణమయ్యే వైరస్ల మాదిరిగానే గాలిలో ఉండదు. ఒక వ్యక్తి తుమ్మినట్లయితే తుంపర్లు గాలిలో వెదజల్లబడతాయి. ఆ సమయంలో వైరస్ గాలిలో ఉన్నప్పుడు అది అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ కరోనా వైరస్ అనేది గాలిలో తేలుతూ ఉండదు. అది ఉపరితలాలపై చేరుతుంది.


మనం ఏసీలు వాడుతున్నప్పుడు కిటికీలు, తలుపులు అనేవి మూసివేస్తాం. అంటే ఆ సమయంలో గదిలో ఉన్నటువంటి గాలి అనేది ఏసీలో రిసైక్లింగ్ చేయబడుతుంది. ఆ గాలి బయటకు వెళ్లదు కాబట్టి.. అది ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటుంది. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటే ఆ గాలి ద్వారా అది అందరికీ వ్యాపించే అవకాశం ఉంది. అంతేకానీ ఏసీలు వాడిన ప్రతి ఒక్కరికీ వైరస్ సోకే అవకాశం ఉండదు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM