కరోనా పరీక్షలు చేయించుకోవాల్సింది వీరే..కేంద్రం మార్గదర్శకాలు

by సూర్య | Sat, Mar 28, 2020, 03:59 PM

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. జలుబు,దగ్గు,జ్వరం,తీవ్ర ఆయాసం దీని లక్షణాలు కావడంతో ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు. గ్రామాలల్లో ఎవరూ దగ్గినా..తుమ్మినా కరోనా అనే భయం వెంటాడుతోంది. దీంతో కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య శాఖ కరోనా పరీక్షలు ఎవరూ చేయించుకోవాలో చెబుతూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి ఇవే.


- గత 14 రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే. వ్యాధి లక్షణాలు లేకపోయినా విదేశాల నుంచి వచ్చిన వారు పరీక్షలు చేయించుకోవాలి.


- కరోనా నిర్దారణ అయిన వారిని కలిసిన వారు, వారి వెంట తిరిగిన వారు కూడా తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.


- కరోనా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారిని కలిసిన బంధువులు,స్నేహితులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.


- వైద్య రంగంలో పని చేస్తున్న డాక్టర్లు,నర్సులు,సిబ్బంది విధిగా తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.


- వివిధ కారణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన వారు,పొందుతున్న వారు కూడా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.


- శ్వాస కోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.


- జలుబు,దగ్గు,జ్వరం,ఆయాసం ఉన్నా ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM