ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా సహనాన్ని ప్రదర్శించాలి : విజయసాయిరెడ్డి

by సూర్య | Sat, Mar 28, 2020, 12:00 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. వైరస్ లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్లకు తరలించి చికిత్స అందిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేస్తూ... వారు ఎవరెవరిని కలుసుకున్నారనే వివరాలను సేకరిస్తూ... అందరికీ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ విన్నపం చేశారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించగలిగితే... ఇప్పట్లో వ్యాక్సిన్లు, ఔషధాలతో అవసరమే ఉండదని చెప్పారు. సీఎం జగన్, అధికారుల విన్నపం మేరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా సహనాన్ని ప్రదర్శించాలని కోరారు. దేశంలోనే అతి తక్కువ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలని విన్నవించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM