కరోనా రూపం ఇదే....ఫొటో తీసిన శాస్త్రవేత్తలు

by సూర్య | Sat, Mar 28, 2020, 09:19 AM

కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని గజాగజా వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మ జీవి 25వేల మందికిపైగా ప్రజల్ని బలితీసుకుంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కఐతే ఎట్టకేలకు దీన్నీ రూపాన్ని పట్టుకున్న భారతీయ శాస్త్రవేత్త.. మైక్రోస్కోప్ ద్వారా ఫొటో తీశారు. పుణె వైరాలజీ ల్యాబ్‌లో ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి చిత్రీకరించారు. ఈ ఫొటో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైతం ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఇది అచ్చం ‘మెర్స్-కోవ్’ వైరస్‌ను పోలి ఉంది. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM