ఇవి మూడూ తింటే మీకు తిరుగులేదు..

by సూర్య | Fri, Mar 27, 2020, 06:11 PM

శరీరంలో విటమిన్ సీ అనేది సమృద్ధిగా ఉంటే అది శరీర బరువును బ్యాలెన్స్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వేరే దారిలేక జంక్ ఫుడ్ తింటున్నవారికీ, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చెయ్యలేకపోతున్నవారికీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండాలి. విటమిన్లూ, మినరల్స్‌ కలిగి ఉండాలి. మీకు తరచుగా అలసట వస్తున్నా, మాటిమాటికీ మూడ్ మారిపోతున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు, స్కిన్ ఎండిపోతున్నా మీకు సీ విటమిన్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్ సీ రెగ్యులర్‌గా అవసరం. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు శరీర కణాలు పాడవకుండా చేస్తుంది. మరి తరచూ ఈ పండ్లు తింటే విటమిన్ సీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ : మార్కెట్లలో ఏడాది మొత్తం దొరికే వాటిల్లో నిమ్మకాయలు ఒకటి. వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. తరచుగా నిమ్మరసంలో చక్కెర, ఉప్పు కలిగి తాగితే మీ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఉసిరికాయ : ఉసిరి కాయల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. దగ్గు, జలుబు కూడా పరారవుతాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా ఉసిరి కాయలు తినడం మంచిది.
చెర్రీస్ : ఎరుపు రంగులో మెరిసిపోయే చెర్రీ పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ సీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తింటే విటమిన్ సీ బాడీకి ఎక్కువగా అందుతుంది. బాడీలో వేడి పెరిగితే, విటమిన్ సీ బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల దీన్ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM