వైద్యులపై రాష్ట్రపతి ప్రశంసలు

by సూర్య | Fri, Mar 27, 2020, 02:05 PM

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాగా కోవిడ్-19 సవాలు ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది చేస్తున్న కృషిపై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల అమలుపై చర్చించారు. కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న దీని కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి గవర్నర్లకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Latest News

 
పర్చూరులో చరిత్ర సృష్టించిన ఏలూరి ర్యాలీ Tue, Apr 23, 2024, 12:18 PM
నేడు షర్మిల రాక! ఆమంచి నామినేషన్ Tue, Apr 23, 2024, 12:16 PM
పెద్దపాడు నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరిక Tue, Apr 23, 2024, 12:05 PM
ఒంగోలు అసెంబ్లీకి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు Tue, Apr 23, 2024, 11:56 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొట్టిపాటి Tue, Apr 23, 2024, 11:55 AM