నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ ఉదయం తినడం వలన కలిగే ప్రయోజనాలు...!

by సూర్య | Fri, Mar 27, 2020, 10:27 AM

నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ ఉదయం తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మధుమేహం పరారవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టిన బాదంలో విటమిన్‌ బి17 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలతోనూ పోరాడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కంతుల పెరుగుదలనూ అడ్డుకుంటాయి, బీపీనీ తగ్గిస్తాయి. వీటిల్లోని విటమిన్‌-ఇ ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మకణాలను రక్షించడం ద్వారా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది.  నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. బాదంలో వుండే మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి పొట్టనిండిన అనుభూతిని కలిగిస్తాయి. దాంతో బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి గర్భిణీ మహిళలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

 
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం Thu, Mar 28, 2024, 03:52 PM
టంగుటూరు మండలం సూర రెడ్డిపాలెం వద్ద ఘోర ప్రమాదం.. Thu, Mar 28, 2024, 03:52 PM
ఏప్రిల్ 14 లోగా ఓటు కోసం దరఖాస్తు ..కలెక్టర్ Thu, Mar 28, 2024, 03:50 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకి లక్ష సాయం Thu, Mar 28, 2024, 03:50 PM
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి.. ముఖేష్ కుమార్ మీనా Thu, Mar 28, 2024, 03:46 PM