ఖైదీలకు వరమైన కరోనా...!

by సూర్య | Thu, Mar 26, 2020, 05:11 PM

కరోనా వైరస్‌ కు ప్రపంచం మొత్తం హడలిపోతుండగా.. జైళ్లలోని ఖైదీలు మాత్రం ఆనంద తాండవం చేస్తున్నారు.ఈ వ్యాధి కొందరు ఖైదీలకు వరంలా మారింది. ఏళ్లతరబడి జైల్లో మగ్గుతున్న వీరికి స్వేచ్ఛ దొరికినట్లయింది. జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో కరోనావైరస్ వ్యాప్తి భారతదేశం అంతటా వ్యాపించడంతో, వచ్చే 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని తీహార్ సెంట్రల్ జైలు నిర్ణయించినట్లు తీహార్ జైలు పరిపాలన మీడియాకు తెలిపింది. అంతేకాదు చెన్నై లో కూడా మరో మూడు వేలమంది ఖైదీలు విడుదల కానున్నారు. తీహార్ జైలు రాబోయే 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. వీరిలో 1500 మంది దోషులను పెరోల్‌పై, ఇతర 1500 మంది ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో అల్లర్లకు పాల్పడిన 261 మంది ఖైదీలను దేశంలోని వివిధ జైళ్లలో ఉంచారు. వీరికి కూడా తాత్కాలికం ఊరట కల్పించించారు. మరోవైపు చెన్నై సెంట్రల్‌ పుళల్‌ జైల్లో ఆడ, మగ కలుపుకుని 3 వేల మందికి పైగా ఖైదీలున్నారు. ఈ జైలులోని ఖైదీలను విడుదల చేయాలని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే జైలు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, విడుదల చేయబోయే ఖైదీల పేర్లను మాత్రం ఇంకా ఇవ్వలేదు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM