హర్యానాలో 19 జైళ్ల నుండి ఖైదీలు విడుదల

by సూర్య | Thu, Mar 26, 2020, 04:57 PM

కరోనా వైరస్ 19 జైళ్లలో ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా ఖైదీలను పెరోలు, లేదా బెయిలుపై విడుదల చేయాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఈ సందర్భంగా హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా మాట్లాడుతూ హర్యానా రాష్ట్రంలో ఖైదీలతో రద్దీగా ఉన్న19 జైళ్లలో ఏడేళ్ల కారాగార శిక్ష పడిన ఖైదీలను పెరోల్, బెయిలుపై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జైళ్ల నుంచి ఖైదీల విడుదలకు జైలులో వారి ప్రవర్తన, వారిపై ఉన్న ఇతర కేసుల గురించి పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా విదేశీ ఖైదీలను విడుదల చేయబోమని మంత్రి చెప్పారు. జస్టిస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ విజయ్ వర్దన్, జైళ్లశాఖ డైరెక్టరు జనరల్ కె సెల్వరాజ్ లు పాల్గొన్నారు.

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM