ఆస్తమా రోగులకు కరోనా ప్రమాదమెక్కువ...!

by సూర్య | Thu, Mar 26, 2020, 01:31 PM

ఏటా సీజన్ మారుతుంటే జలుబు, ఫ్లూ లాంటి వాటితో దగ్గులు, తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఆస్తమా ఉన్న వారి పరిస్థితి వేరేలా ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మిగిలినవారి కంటే భిన్నంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ ఏడాది ఆస్తమా రోగులకు కరోనా రూపంలో మరో ప్రమాదం వచ్చిపడింది. రోగనిరోధక శక్తిపై దాడి చేసే కరోనావైరస్.. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి అటాక్ అయింది. దాదాపు 18వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వ్యక్తుల కంటే ఆస్తమా రోగులను కరోనా మరింత ప్రమాదానికి గురిచేస్తుందనేది వాస్తవం. WHO ప్రకారం.. ఆస్తమా.. డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవాళ్లకు కరోనా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆస్తమా పేషెంట్లు అందరిలా కాకుండా ఏ ఒక్క లక్షణం కనిపించినా.. వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. వైద్యులు అంటున్నారు. ఆస్తమా గాలిలో ఉన్న వైరస్‌ను ఇట్టే ఆకర్షిస్తుందని.. అంటున్నారు. కానీ, చైనా, దక్షిణకొరియాలో సంభవించిన కరోనా మృతులలో ఆస్తమా కారణంగా ప్రత్యేకంగా చనిపోయిన కేసులు తక్కువే.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM