విజయవాడ తిరువూరు సరిహద్దు వద్ద ఉద్రిక్తత

by సూర్య | Thu, Mar 26, 2020, 11:45 AM

లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి పయనమైన విద్యార్థులు, ఉద్యోగులను ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. కరోన ప్రభావంతో ఆంధ్ర లోకి అనుమతి లేదని ఎక్కడి వారు అక్కడే ఉండాలని పోలీసులు తేల్చి చెప్పారు. విజయవాడ తిరువూరు సరిహద్దు వద్ద రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నిలిపి వేయడంతో తిరువూరు వైపు వాహనదారులు మళ్లారు. దీంతో పోలీసులు తిరువూరు చెక్ పోస్టును మూసేశారు. అక్కడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తమను వెళ్లనివ్వాలని పోలీసులతో వాహనదారులకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అటు.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల బోర్డర్‌లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కాగా, ఏపీలోకి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో క్వారంటైన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 13కు చేరుకుంది. జమ్మూకశ్మీర్‌లో 68 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ సోకి మృతిచెందాడు. కాగా, ఏపీలో 10 కేసులు, తెలంగాణలో 41 కేసులు నమోదయ్యాయి.

Latest News

 
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM
రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా నిలబడాల్సివస్తుంది Thu, Mar 28, 2024, 01:50 PM
వైసీపీకి రాజీనామా చేసిన బీసీ నేత Thu, Mar 28, 2024, 01:48 PM