లేఖలో పలు సూచనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

by సూర్య | Wed, Mar 25, 2020, 04:27 PM

కరోనా నియంత్రణ చర్యల నేపథ్యంలో సీఎం జగన్​కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, పేద కుటుంబాలను ఆదుకోవడంపై.... లేఖలో పలు సూచనలు చేశారు. ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయడంతో పాటు.... 5 వేలు నగదు సాయం చేయాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.... ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.బ్లాక్ మార్కెటింగ్‌, దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని.... విదేశాల నుంచి వచ్చినవారిని క్వారంటైన్ చేయాలని.... ఐసోలేషన్ వార్డులు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సూచించారు

Latest News

 
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM