షాపింగ్‌ మాల్స్‌లో కఠిన నిబంధనలు

by సూర్య | Wed, Mar 25, 2020, 03:38 PM

న్యూఢిల్లీలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాలను మాత్రమే విక్రయిస్తున్న రియలన్స్‌ ఫ్రెష్‌, మోర్‌, వాల్‌మార్ట్‌, క్యాష్‌ అండ్‌ క్యారీ తదితర రిటైల్‌ స్టోర్స్‌ యాజమాన్యాలు కరోనా కట్టడికి మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాయి. స్టోర్స్‌లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులను అనుమతిస్తూ సామాజిక దూరం నిబంధనను అమలు చేస్తున్నాయి. ఒకరు కొనుగోళ్లు పూర్తి చేసి బయటకు వచ్చిన తరువాతే మరొకరిని పంపుతున్నారు. కొనుగోలుదారులను స్క్రీనింగ్ చేయడంతో పాటు చేతులను శానిటైజ్‌ చేసి మరీ లోపలికి అనుమతిస్తున్నారు. బిల్లింగ్‌ కౌంటర్‌ వద్ద గుంపుగా నిలబడకుండా టోకెన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ యాజమాన్యం తెలిపింది.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM