ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా కట్టడి :జగన్

by సూర్య | Tue, Mar 24, 2020, 09:40 AM

రాష్ట్రంలో కరోనా నివారణ కోసం లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలకు సంబంధించి సోమవారం పోలీస్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కేవలం నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కరికి మాత్రం అనుమతులు మంజూరు చేయాలన్నారు. కరోనా వైరస్‌ ప్రభావాన్ని, తీవ్రతను వివరించి ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాల్సిన బాధ్యతను అధికారులు గుర్తు చేయాలని సూచించారు. సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు అందుబాటులో ఉన్న వనరులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా సోకిన వారిలో 80.9 శాతం మంది హోం ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారని తెలిపారు. కేవలం 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. అందులో కేవలం 4.7 శాతం మంది మాత్రమే ఐసీయులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 450 వెంటిలేటర్లతో పాటు 1300 బెడ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM