ప్రపంచవ్యాప్తంగా 15 వేలు దాటేసిన కరోనా మరణాలు

by సూర్య | Tue, Mar 24, 2020, 08:03 AM

  కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 15 వేలు దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,189 మంది చనిపోయారు. వీరిలో ఒక్క యూరప్ వాసులే 9,197 మంది ఉండడం గమనార్హం.     గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 462 మంది స్పెయిన్‌ దేశస్తులు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 2,182కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 33,089కి చేరింది. ఇటలీలో 5,476 మందిని కరోనా మహమ్మారి బలితీసుకోగా, చైనాలో 3,270, స్పెయిన్‌లో 2,182 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM