కరోనా ఎఫెక్ట్.. ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం

by సూర్య | Sat, Mar 21, 2020, 06:18 PM

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సమేతంగా ప్రయాణించే ఓలా షేర్ కేటగిరిని తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు ఓలా యాజమాన్యం ప్రకటించింది. కరోనా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓలా యాజమాన్యం స్పష్టం చేసింది. ఓలా షేర్ ను తగ్గించడం వల్ల ప్రయాణికుల సంఖ్య కూడ తగ్గుతుందని ఓలా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ఓలాలోని మైక్రో, మీనీ, ప్రైమ్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. కరోనా కారణంగా ఓలా క్యాబ్స్‌లాగే మిగతా క్యాబ్‌ సంస్థలు కూడా తాత్కాలికంగా నిలిపేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM