కరోనాపై జిల్లాల్లో టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు

by సూర్య | Sat, Mar 21, 2020, 03:34 PM

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. జిల్లాల వారీగా వైరస్​ వ్యాప్తి పర్యవేక్షణకు టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కరోనా వ్యాప్తి నిరోధానికి జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించిన సర్కారు.. వారి నేతృత్వంలోనే కలెక్టర్​, ఎస్పీ సహా 18 మందితో టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్​గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్​గా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని నియమించింది. వైస్​ చైర్మన్​గా జేసీ - 1, సభ్యుడిగా జేసీ - 2, ఆరోగ్య సేవల జిల్లా సమన్వయకర్తగా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్​ వ్యవహరిస్తారు. డీటీఓ, డీఎస్ఓ, డీపీఓ, డీఈఓ, డీఆర్డీఏ పీడీ, ఆర్టీసీ ఆర్ఎంలు సైతం సభ్యులుగా ఉంటారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో సభ్యులుగా మున్సిపల్ కమిషనర్లు, ఐసీడీఎస్ పీడీ, రైల్వే, విమానాశ్రయాల ప్రతినిధులను టాస్క్​ఫోర్స్​లో భాగం చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM