తెలుగు రాష్ట్రాల్లో ఐసోలేషన్ వార్డులు ఎలా ఉన్నాయి..?

by సూర్య | Sat, Mar 21, 2020, 12:59 PM

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. మనదేశంలో ఇప్పటివరకు 223 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, తెలుగురాష్ట్రాలలో మొత్తం 21 పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదు అయ్యాయి. రోజురోజుకి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తుంది. విదేశాల నుండి వచ్చే వారికి ఎయిర్ పోర్టులలో చెక్ చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ కొన్ని రోజుల తరువాత వారు కరోనా బారిన పడుతుండటం మరింత టెన్షన్ పెట్టిస్తుంది.
కరోనా వైరస్ పై ఇప్పటికే అప్రమత్తమైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయించి, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి చికిత్సను అందిస్తునాయి. ప్రస్తుతానికి విదేశాల నుండి వచ్చిన వారిని మాత్రమే ఐసోలేషన్ వార్డులలో చేర్చుకుంటున్నారు. అయితే మరో వారం రోజుల్లో కరోనా వైరస్ భారీ ఎత్తున ప్రబలే అవకాశం ఉండటంతో వైరస్ ను ఎదుర్కోవడానికి జిల్లాల స్థాయిలో ఉన్న ఏర్పాట్లు భయపెడుతున్నాయి.
ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో 10 నుండి 40 పడకల వరకు ఐసోలేషన్ వార్డులను రెడీగా ఉంచి, కరోనా లక్షణాలతో వస్తున్న వారికి చికిత్స అందిస్తున్నారు. దాంతో పాటు మార్కెట్ లో మాస్క్ లు, శానిటైజర్ ల కొరత తీవ్రంగా ఉంది. అయితే రోజురోజుకి కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటం కలవరం పెడుతుంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితుల సంఖ్య పెరిగితే వారందరికీ చికిత్స చేయడానికి సరిపోయేంత ఏర్పాట్లు మాత్రం ప్రస్తుతం లేవు.
రాబోయే రోజుల్లో కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో కరోనా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి ఎక్కువ మందికి చికిత్సను అందించేవిధంగా అత్యవసరంగా ఏర్పాట్లు చేయకపోతే రెండు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM